300 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

ప్రకాశం: తెలుగు దేశం పార్టీకి చెందిన 300 కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. గిద్దలూరు నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్‌ ఐవీ రెడ్డి సమక్షంలో గిద్దలూరు ఏబీఎం పాలెంకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో వాగ్ధానాలు చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని కళ్లిబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మ్యానిఫెస్టోలోని ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రావాల్సిన సంక్షేమ పథకాలను పచ్చ నేతలే దోచుకుంటున్నారని ఆరోపించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ రాజన్న పాలన వస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు అధికమవుతాయని, భవిష్యత్తు వైయస్‌ఆర్‌సీపీదే అని చెప్పారు.

Back to Top