శ్రీమతి విజయమ్మ హోలీ శుభాకాంక్షలు

హైదరాబాద్ 27 మార్చి 2013:

రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా చేసుకునే రంగుల పండుగ హోలీ అని ఆమె పేర్కొన్నారు. దేశంలోని విభిన్న సంస్కృతులను హోలీ గుర్తుచేస్తుందన్నారు. వసంతాలకు ఆహ్వానం పలికే ఈ హోలీ పండుగతో రాష్ట్ర ప్రజల జీవితాలలో హర్షాతిరేకాలు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా స్నేహసౌభ్రాతృత్వాలతో హోలీ చేసుకోవాలని ఆమె కోరారు.

Back to Top