హోదా ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం..!

గుంటూరు: వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం కీలక మలుపు తిరుగుతుందని, మహోద్యమంగా మారేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష పునాది కానుందని  అంబటి రాంబాబు చెప్పారు. 

దీక్ష రెండోరోజుకు చేరుకున్న సందర్భంగా అంబటి మాట్లాడుతూ...కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ,టీడీపీలు మాట తప్పాయన్నారు. వైఎస్ జగన్ ప్రత్యేకహోదా కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారని, కేంద్రానికి తమ డిమాండ్ తెలియజేశారని గుర్తు చేశారు. తక్షణమే కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఇది మహోద్యమంగా మారుతుందని అంబటి రాంబాబు హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top