గుర్రపు సవారీతో భూమన నిరసన

తిరుపతి, 24 సెప్టెంబర్‌ 2012: నిరుపేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రయాణించే బస్సు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడంపై తిరుపతి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోమవారంనాడు ఆయన తిరుపతి వీధుల్లో గుర్రపు సవారీ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బస్సు చార్జీలు పెంచలేదని ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. వైయస్‌ఆర్‌ ఆశయాలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ర్ట ప్రజలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నష్టాలను సాకుగా చూపించి, అనేక కుయుక్తులు పన్ని ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూశారని భూమన ఆరోపించారు. నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి లాభాల బాట పట్టించారని గుర్తుచేశారు. వైయ̴స్ సమయంలో ఉత్నత స్థితికి వెళ్ళిన ఆర్టీసీని ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి ఐదు నిమిషాలు కూడా పరిపాలించే అర్హత లేదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని భూమన పేర్కొన్నారు.


తాజా వీడియోలు

Back to Top