గుజ్రాల్ మృతికి శ్రీమతి విజయమ్మ సంతాపం

హైదరాబాద్ 30 నవంబర్ 2012 : భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ ఐకె. గుజ్రాల్ మరణం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్.విజయమ్మగారు సంతాపం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, విజ్ఞుడు, రాజనీతి దురంధరుడు అయిన శ్రీ గుజ్రాల్ దౌత్యవేత్తగా, విదేశాంగ మంత్రిగా అసమాన సేవలు అందించారని కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, సమాచార, పార్లమెంటరీ శాఖ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శ్రీ గుజ్రాల్ రాజకీయంగా దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో భారత 12 వ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారన్నారు. నాటి దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి ఆయన చేసిన కృషి అసమానమని అన్నారు. గుజ్రాల్ మృతితో ఒక మేధావి అయిన నాయకుడిని దేశం కోల్పోయిందని శ్రీమతి విజయమ్మగారు అన్నారు. ఈ సందర్భంగా శ్రీ గుజ్రాల్ కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Back to Top