యలమంచలి నియోజకవర్గంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

విశాఖ‌: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 243వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దార్లపూడి నుంచి ప్రారంభించ‌గా ఏటికొప్పాక వ‌ద్ద యలమంచిలి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా రాజ‌న్న బిడ్డ‌కు స్థానికులు, పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఏటికొప్పాక వ‌ద్ద వేలాది మంది జ‌నం త‌ర‌లివ‌చ్చి జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.  ఈ నెల 14న విశాఖ‌ జిల్లాలో ప్రవేశించిన వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ముగిసి యలమంచలిలో ప్రవేశించింది.  ఇవాళ‌ ఏటికొప్పాక, పధ్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్త పురం వరకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతుంది.   పార్టీ యలమంచలి కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు (కన్నబాబురాజు) ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  
Back to Top