ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట

మండపేట: మండలంలోని జెడ్‌ మేడపాడులో సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామివార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ గురుస్వామి ఎస్‌ఎల్‌ కనకరాజు దంపతులు, ఆలయ నిర్వాహకులు శేషుబాబు దంపతులు విగ్రహప్రతిష్టాపన పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వి. సాయికుమార్, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటి పాలక మండలి సభ్యులు పడాల సుబ్బారెడ్డి, ఎస్‌బీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ సత్తి బులస్వామిరెడ్డి, మాజీ సర్పంచ్‌ మ్రరెడ్డి శ్రీనివాస్, ఆలయ కమిటి సభ్యులు ఎలుబండి నాగేశ్వరరావు, నండూరి నాగబాబు, కోరం శ్రీనివాస్, దేవు భాస్కరనాయుడు, అత్తిలి వెంకన్నబాబు, కవల ధనరాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top