సర్కార్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం

చిత్తూరు:  కృష్ణా జిల్లాలో ఇటీవ‌ల చోటు చేసుకున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంపై చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి విమర్శించారు. గురువారం పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఎంపీ మాట్లాడారు. కృష్ణాజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 11మంది మృతి చెందగా, పలువురు గాయపడితే వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్ష నేత ప్రశించడం తప్పా? అని ప్రశ్నించారు. దోషులను తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేద‌ని, చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నాయ‌ని మిథున్‌రెడ్డి హెచ్చ‌రించారు. 

Back to Top