విజయమ్మ రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే

తిరుపతి 22 ఆగస్టు 2013:

రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని  డిమాండు చేస్తూ  గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి  వైయస్. విజయమ్మకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్వాతంత్య్ర సమర యోధుడు, గాంధేయవాది చెరుకుమూడి శ్రీవాత్సవ నియోగి స్పష్టంచేశారు. బత్తలవల్లం గ్రామంలో పార్టీ నేతలు ఉజ్వల్‌ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, గిరిరెడ్డి చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం విజయమ్మ దీక్ష చేస్తుండడం అభినందనీయమన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్. జగన్మోహన్‌ రెడ్డి త్వరలోనే విడుదలై సత్యవేడు ప్రాంతంలో పర్యటించాలని ఆయన అభిలషించారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. తెలుగు మాట్లాడే వారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని స్పష్టంచేశారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్  చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయుత్రీదేవి, నాయకులు బీరేంద్ర వర్మ, కేశవులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట కృష్ణయ్యు, పార్టీ మండల కన్వీనర్లు సుబ్రమణ్యం రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, బందిల సురేష్, రాచర్ల భూషణం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top