దేశంలో ఇంత దారుణమైన సీఎం మరొకరు ఉండరుపోలవరం నిర్వాసితుల బాధలు పట్టవాపట్టిసీమకో రేటు..పోలవరం నిర్వాసితులకో రేటాఇంతమంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేదేంటి బాబూ?రెండేళ్లయినా ముంపు మండలాల సమస్య తేలకపోవడం సిగ్గుచేటుకుకునూరుపల్లిలో నిర్వాసితులతో వైయస్ జగన్ ముఖాముఖి
పశ్చిమగోదావరి జిల్లా(కుకునూరుపల్లి): అన్యాయాలను సరిదిద్దుకోవాలని ప్రశ్నిస్తే...అభివృద్ధిని అడ్డుకుటున్నారంటూ చంద్రబాబు తమపైనే బురదజల్లుతున్నారని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మండిపడ్డారు. ఎవరైతే భూములు కోల్పోయారో, పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగాలు చేశారో వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరితే వైయస్ జగన్‌కు పోలవరం ప్రాజెక్టు రావడం ఇష్టం లేదని బండ వేస్తున్నారని ఫైర్ అయ్యారు. కుకునూరుపల్లిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వైయస్ జగన్ అండగా నిలిచారు. ఈసందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే.....
మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంటే.. జరిగేది అన్యాయం అని చెబితే పాలకపక్షం వాళ్లు మన గోడు వినడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా గోడు వినండి, మా పరిస్థితిని చూడండి.. మేం అన్యాయంగా ఏమీ చెప్పడం లేదు, మేం అడిగేది పూర్తిగా న్యాయబద్ధమైన కోరికలే. వాటిని నెరవేర్చడానికి మనసు రాకపోవడం దారుణమని అంటున్నాం. ఇక్కడికి వచ్చినపుడు భూములు కోల్పోయినవారు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసినవారిని ఆదుకునే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేయండి, తోడుగా నిలబడండి అని అడిగితే చంద్రబాబు ఏమన్నారో తెలుసా.. ‘పోలవరం ప్రాజెక్టు రావడం జగన్కు ఇష్టం లేదు’ అంటారురాజధాని విషయంలో అన్యాయంగా భూములు లాక్కుని, సింగపూర్ కంపెనీలకు ఇష్టం వచ్చిన రేట్లకు ఇస్తున్నారులంచాలు తీసుకుని వాళ్లు, మీరు వ్యాపారాలు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. అమరావతిలో రాజధాని రావడం జగన్ కు ఇష్టం లేదని మాట్లాడుతున్నారుఅన్యాయం జరుగుతోంది, సరిదిద్దాలని అడిడితే బురద జల్లుతున్నారుపోలవరం రావాలన్నది రాష్ట్ర ప్రజలందరి కోరిక. అది వస్తేనే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం రాష్ట్రానికి మేలు జరుగుతుంది.ఆ ప్రాజెక్టు కోసం 110 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశా.ఎవరూ ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు.. పోలవరం రావాలని చెప్పేవాళ్లలో అందరం ఇక్కడే ఉన్నాంపోలవరం కోసం త్యాగాలు చేసిన వీళ్లకు సరైన న్యాయం చేస్తున్నామో లేదో పాలకులు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలివీళ్లు అడిగే ఏ కోరిక అన్యాయం అనిపించడం లేదుపట్టిసీమలో 20 లక్షలిస్తున్నారు.. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారుఅదే తమకు కూడా వర్తింపజేయాలని అడగడంలో తప్పేముందిచంద్రబాబును గట్టిగా అడుగుతున్నాం.. ఒకే జిల్లాలో పక్కపక్కనే ఉన్న ప్రాజెక్టులు ఒక్కోదానికి ఒక్కో ప్యాకేజి ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నా.భూముల రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేలా వర్తింపజేయాలిఇక్కడ అన్నీ 1/70 భూములు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ విలువ తక్కువ చూపిస్తారుసత్తుపల్లి, అశ్వారావుపేటలో ఎకరాకు 7 లక్షల మార్కెట్ రేటు ఉంది.. పట్టిసీమలో 20 లక్షలు మీరే ఇస్తున్నారుఇక్కడ మాత్రం భూముల విలువ ఎందుకు తగ్గిస్తున్నారుచింతలపూడి నుంచి పట్టిసీమ, పోలవరం అన్నీ పక్కపక్కనే ఉన్నాయిపట్టిసీమకు అమలుచేసిన ప్యాకేజినే అందరికీ వర్తింపజేయాలివీళ్ల భూములు 8, 9 ఏళ్ల క్రితం ఎకరాకు 1.15 లక్షల చొప్పున ఇచ్చి అప్పట్లో తీసుకున్నారుఇది అప్పటి రేటు.. ఇప్పుడు 20 లక్షల వరకు చేరింది. ఎక్కడైనా కొనాలంటే ఆ 20 లక్షలు పెడితే తప్ప ఎకరా భూమి కూడా దొరకట్లేదుమా పరిస్థితి ఏంటి.. కాస్తో కూస్తో మాకు కూడా పరిహారం పెంచి ఇవ్వక్కర్లేదా అని అడుగుతున్నారుఈ ప్రాజెక్టు కోసం మొదటి వరుసలో నిలబడి భూములు ఇచ్చినవాళ్లు ఉన్నారు2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 20 నుంచి సెక్షన్ 30 వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు ఎటువంటి వినియోగం చేయకపోతే భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలి.అలా కూడా అక్కర్లేదు.. తమకు పరిహారం పెంచాలని మాత్రమే వీళ్లు అడుగుతున్నారుపట్టిసీమలాగ ఎకరానికి 20 లక్షలు కూడా అడగడం లేదు, అప్పుడిచ్చిన దానికి 5 లక్షలు పెంచి ఎక్స్గ్రేషియా ఇస్తే చాలని చాలా న్యాయంగా అడుగుతున్నారుపోలవరం ప్రాజెక్టు అంచనా 32 వేల కోట్లు అంటున్నారు. ఇలా భూములు ఇచ్చినవాళ్లకు కాస్తో కూస్తో ఇస్తే ప్రాజెక్టు మొత్తం విలువలో అది 5 శాతం కూడా ఉండదు కదా.భూములు ఇచ్చినవాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండాలి, వీళ్ల త్యాగాలు మర్చిపోకూడదన్నది చంద్రబాబు తెలుసుకోవాలి.భూములన్నీ కోల్పోయినా పోలవరానికి వీళ్లు అండగా నిలబడుతున్నారు.పోడు భూములు, అసైన్డ్ భూములు, ఏ పేరైనా సరే.. ప్రభుత్వం మాకు ఆ భూములు ఇచ్చిన తర్వాత అవి మావే కాబట్టి ప్రైవేటు భూములకు ఇచ్చిన రేటు, పరిహారం మాకు కూడా ఇవ్వాలి కదా అని కోరుతున్నారువాళ్లు నిరుపేదలు కాబట్టే ఆ భూములు ఇచ్చారు. అలాంటి పేదలకు కాస్తో కూస్తో ఎక్కువ ఇవ్వాలి గానీ తగ్గిస్తే ఎలా.వీళ్లకు ఇస్తున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేవలం 2, 3 లక్షలు దాటడం లేదు.. దాంతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారుకొత్త ఇల్లు కట్టుకోవాలంటే 5 సెంట్ల స్థలానికి కూడా సరిపడ మొత్తం రావట్లేదు. కనీసం 10 లక్షల ప్యాకేజి ఇవ్వాలని వాళ్లు అడిగేది న్యాయబద్ధంగానే ఉంది.ముంపు మండలాలు ఏపీలో చేరి రెండేళ్లయింది. ఇప్పటికీ వాళ్లకు సంబంధించిన స్థానికత సమస్య తేలలేదంటే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలిస్థానికత ఇవ్వకపోవడంతో పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంటు, ప్రభుత్వ పథకాలు అందడం లేదుపిల్లలు డీఎస్సీ రాయాలన్నా, ఇంకేం రాయాలన్నా ఏ రాష్ట్రం వాళ్లో తెలియడం లేదుఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలూ వీళ్లను కాదంటున్నాయిప్రతి విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగిన పనులు కూడా చేయడం లేదుఇంతమంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేదేంటి బాబూ?20 మంది ఎమ్మెల్యేలకు 30 కోట్ల చొప్పున కొన్నావు.. అంటే 600 కోట్లు ఖర్చుపెట్టావుఎక్కడికి వెళ్లినా ప్రైవేటు విమానం తప్ప మామూలు విమానం ఎక్కడం లేదుబాబు పాలనలో ఏది చూసినా టెంపరరీ బిల్డింగులే. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక నివాసం..చివరకు చంద్రబాబు ఇళ్లకు, ఆఫీసులకు చేసిన మరమ్మతల ఖర్చు లెక్క వేసుకుంటే 100 కోట్లు అవుతుందికన్సల్టెన్సీలకు ఇంత, నాకింత అని చెప్పి ఈ రెండేళ్లలో 300 కోట్లు ఇచ్చారుఈ డబ్బు కాస్త ఇటువైపు మళ్లిస్తే పోలవరం ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకు వచ్చేవాళ్లుపోలవరం ప్రాజెక్టును కూడా బాబు అడ్డగోలుగా నాశనం చేస్తున్నారుదీని గురించి కేంద్రం లేఖలు రాస్తోంది.. కాంట్రాక్టరు పనులు సరిగా చేయడంలేదని, మార్చాలని చెప్పిందిచంద్రబాబు మాత్రం ఆ కాంట్రాక్టరు తన బినామీ కాబట్టి మార్చే ప్రసక్తి లేదంటున్నారుకేంద్రాన్ని మోసం చేస్తూ.. పోలవరం ప్రాజెక్టులో లంచాల కోసం సబ్ కాంట్రాక్టరును కూడా తెచ్చుకుంటున్నారువాళ్ల ద్వారా కోట్లకు కోట్లు దండుకుంటున్నారుచివరకు కేంద్రం కూడా ఈ దోపిడీని చూసి పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ విషయంలో నాలుగడుగులు వెనక్కి వేస్తున్నారుదేశంలోనే ఇంత దారుణమైన సీఎం ఎవరూ ఉండి ఉండరుఈ రెండేళ్లలో బాబు చేసింది సున్నామీరు అడుగుతున్నవన్నీ చదివాను.. అవన్నీ సమంజసమైనవేపొరపాటున ఏదైనా మీకు అందకపోతే నిరాశ పడక్కర్లేదుమీరు ప్రాజెక్టుకు తోడుగా ఉండండి.. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం సాగదుమరో రెండేళ్లకో, సంవత్సరానికో మన ప్రభుత్వం వస్తుందిఇప్పుడు మీరు చెప్పినవన్నీ పూలలో పెట్టి మీకు అందించి మీ ముఖాల్లో చిరునవ్వు చూస్తాపోలవరం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాంచంద్రబాబు మీద పోరాటం మాత్రం కొనసాగిస్తాందానికి దేవుడి దయ కావాలి.. మీరంతా చంద్రబాబు ప్రభుత్వం పోవాలని కోరుకోవాలికడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు