ప్రజల ప్రాణాలతో సర్కారు ఆటలు: భూమన

తిరుపతి 26 జూన్ 2013:

పేద ప్రజల ప్రాణాలతో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఆడుకుంటోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే వాడవాడలా బెల్టు షాపులున్నాయనీ,  అవి చాలవన్నట్లు వైన్ దుకాణాలను బార్లుగా మార్చడం దారుణమనీ ధ్వజమెత్తారు. కొత్త మద్యం పాలసీ విధానంపై భూమన తీవ్రస్థాయిలో విమర్శించారు. తిరుపతిలో తాగేందుకు మంచినీళ్లు దొరకటం లేదని... మద్యం మాత్రం ఫుల్లుగా దొరుకుతోందని భూమన తెలిపారు. కిరణ్ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గురువారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Back to Top