చంద్రబాబు భూదందాలో భూములన్నీ గోవిందా

అయినవారికి అప్పనంగా భూములు ధారాదత్తం
బెజవాడలో ఆర్టీసీ ఆస్తుల జోళికొస్తే తరుముతాం..

విజయవాడః
వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి టీడీపీ ప్రభుత్వం భూదందపై నిప్పులు
చెరిగారు. ఖరీదైన భూములను కారుచౌకగా తమ అనుచరులు, కుటుంబీకులకు
కట్టబెట్టడుతున్న వైనంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూదాహానికి
పెద్ద పీఠ వేస్తూ చంద్రబాబు కుటుంబ వ్యవస్థ పరిపాలన కొనసాగిస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు మూర్తికి చంద్రబాబు విశాఖలో
500 ఎకరాలు అప్పనంగా ధారదత్తం చేశారన్నారని గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. 

విజయవాడలో
ఆర్టీసీ ఆధీనంలోని 5 ఎకరాలు..సుమారు రూ.200 కోట్ల పైచీలుకు విలువ చేసే
భూమిని ఇండో అమెరికన్ హాస్పిటల్ పేరు మీద బాలకృష్ణకు కట్టబెడుతున్నారని
నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా హాస్పిటల్ నిర్మాణానికి సహకరించాలంటూ
కార్మికుల నుంచి నెలకు రూ.100 చొప్పున కోట్లాది రూపాయలు వసూలు చేశారని
గౌతంరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బీద పలుకులు పలుకుతూ భూములన్నీ
అయినవారికి దోచిపెడుతున్న విధానాన్ని తూర్పారబట్టారు. 

చంద్రబాబు
భూదోపిడిని అడ్డుకుంటామన్నారు. ఆర్టీసీ, కార్మికుల ఆస్తిపాస్తుల
జోళికొస్తే ఉద్యమిస్తామన్నారు. ఆస్తులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత
ఆర్టీసీ సంస్థ, కార్మికులు, ప్రజాస్వామ్యవాదులందరిపైనా ఉందని గౌతం రెడ్డి
అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం కనీసం వైట్ కార్డు కూడా
ఇవ్వలేదన్నారు. ఆరోగ్యపరంగా నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని, చాలీ
చాలని జీతాలతో వాళ్లు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కార్మికులకు  అండగా
వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ పోరాడుతుందన్నారు.   
Back to Top