ఒంగోలు చేరిన ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర

ఒంగోలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తిరుపతికి చేపట్టిన పాదయాత్ర ఒంగోలు చేరింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒకవైపు రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ట్యాక్స్‌లతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే మంచి పరిపాలన రావాలన్నారు. మంచి పరిపాలన రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. 

Back to Top