గోపాల్‌రెడ్డి గెలుపు హోదాకు మలుపు

క‌ర్నూలు:  పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలిచిన వైయ‌స్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాలరెడ్డి గెలుపు ప్రత్యేక హోదాకు మలుపులాంటిదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మిగ‌నూరు నియోజకవర్గ కన్వీనర్‌ కె.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం అభ్యర్థి గోపాల్‌రెడ్డి అల్లుడు కుమార్‌స్వామిరెడ్డి, ఎన్నికల పరిశీలకులు విజయరాఘవరెడ్డి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలు, యువతతో సమావేశమయ్యారు. కె. జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అబద్దపు వాగ్దానాలతో అధికారం చేపట్టిన టీడీపీ అడుగడుగునా ప్రజలను వంచించిందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను, ఉద్యోగాలు, భృతిపేరుతో నిరుద్యోగులను మోసగించిందన్నారు. మూడేళ్ల బాబుపాలనలో కొత్త ఉద్యోగాలుకాదు కదా ఏకంగా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ ఊడగొట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రత్యేక హోదా రావటమే మార్గమని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల మద్దతు అవసరమని అన్నారు. అనంతరం 100 మంది నిరుద్యోగ యువత వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బీఆర్‌ బసిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ బుట్టారంగయ్య, ధర్మకారి నాగేశ్వరరావు, రియాజ్, సయ్యద్‌ చాంద్, ఈరన్న, బషీర్‌ అహ్మద్, శ్రీనాథ్, అన్వనర్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top