గోకినేపల్లి శివారు నుంచి నేటి పాదయాత్ర

ఖమ్మం, 25 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 131వ రోజు గురువారంనాడు ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం గోకినేపల్లి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ముదిగొండ చేరుకుంటారు. ముదిగొండలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుందని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. అనంతరం వెంకటగిరి ఎక్సు రోడ్‌, గుర్రాలపాడు, సూర్యాపేట ఎక్సురోడ్‌ మీదుగా ఖమ్మం సమీపంలోని ఆటోనగర్ వరకు‌ నడుస్తారు. రాత్రికి ఆటోనగర్‌ వద్ద ఆమె బసచేస్తారు. శ్రీమతి షర్మిల గురువారంనాడు మొత్తం 13.7 కిలోమీట‌ర్ల మేర పాదయాత్ర నడుస్తారని రఘురాం వివరించారు.
Back to Top