చిత్తశుద్ధి ఉంటే శంఖారావానికి అనుమతించండి

కాకినాడ, 13 అక్టోబర్ 2013:

సిఎంకు చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్ కాంగ్రెస్‌ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ‌ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పైకి తాను సమైక్యవాదిని అని చెప్పుకుంటూ, లోపల మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో సభకు అనుమతిస్తే ప్రశాంతంగా నిర్వహించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజలు శాంతికాముకులన్నారు.

సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇస్తే.. గొడవలు జరుగుతాయన్నది కేవలం సాకు మాత్రమేఅని ద్వారంపూడి అన్నారు. ట్యాంక్బం‌డ్పై విగ్రహాలను ధ్వంసం చే‌సిన తెలంగాణవాదులతో సీమాంధ్రులను పోల్చడం సరికాదన్నారు. విభజన వాదులకు సిఎం జైకొడతారా? అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాపాడాలని కోరారు. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని  ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top