విశాఖపట్నంః వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి కొత్తపల్లి గీతపై మండిపడ్డారు. గిరిజనుల ఉద్యమాన్ని కించపరుస్తూ కొత్తపల్లి గీత మతిభ్రమించి మాట్లాడుతోందని ఈశ్వరి విమర్శించారు. గిరిజనుల ఓట్లతో గెలిచి వాళ్లను మోసం చేసిన ద్రోహి అని కొత్తపల్లి గీతపై విరుచుకుపడ్డారు. బాక్సైట్ ఒప్పందాలకు సంబంధించి కొత్తపల్లి గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కైయిందని, అందులో ఆమె వాటా ఎంతో చెప్పాలని ఈశ్వరి ప్రశ్నించారు. <br/>బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మన్యంలో ఉద్యమం ఉధృతం అవుతుంటే...ఢిల్లీలో పబ్లిసిటీ హంట్ గా పార్లమెంట్ వద్ద టీవీల ముందు ఫోజులిస్తూ ఉద్యమం లేదంటూ గీత సిగ్గూశరం లేకుండా మాట్లాడుతోందని నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాదని దమ్మూ ధైర్యం ఉంటే చింతపల్లికి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.