వైయస్‌ జగన్‌ను అడ్డుకోవడానికి సిగ్గులేదా..?

విశాఖ: కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ, పేదల భూములను పరిరక్షించేందుకు మహాధర్నా చేపట్టిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకునేందుకు చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌లకు సిగ్గులేదా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ప్రశ్నించారు. ధర్నాకు తరలివెళ్తున్న ఎమ్మెల్యేలకు, వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను బంధించి అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. భూ ట్యాంపరింగ్‌లపై ఫైల్స్‌ మాయమయ్యాయని స్వయాన మీ కలెక్టరే చెబుతున్నారు. టీడీపీ నేతలు భూదందాలకు పాల్పడ్డారంటూ మీ కేబినెట్‌ మంత్రి, మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా చూపిస్తుంటే ముఖ్యమంత్రి మాట కూడా మాట్లాడలేకపోతున్నారన్నారు. గత కొన్ని రోజులుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భూకబ్జాలపై ఆధారాలు చూపిస్తున్నా.. చంద్రబాబు స్పందించడం లేదన్నారు. 

Back to Top