నాతో పోటీకి సిద్దమా చంద్రబాబూ..

బాక్సైట్ తవ్వకాల కోసం ఆరాట పడుతున్న చంద్రబాబు నాయుడుకి వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సవాల్ విసిరారు. బాక్సైట్ అజెండా గా ఉప ఎన్నికకు సిద్ధ మా
అని  ఆమె సూటిగా ప్రశ్నించారు. బాక్సైట్
తవ్వకాల ప్రదేశాన్ని గిడ్డి ఈశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో
మాట్లాడారు.

 బాక్సైట్ తవ్వకాలు ఆపేయక పోతే.. వచ్చే అసెంబ్లీ
సమావేశాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు.   తన
పదవికి రాజీనామా చేసి తానే మళ్లీ నిలబడతానని, తనతో పోటీకి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు కాని, టీడీపీకి చెందిన మరెవరైనా
పోటీ చేయవచ్చని చెప్పారు.

బాక్సైట్ మైనింగ్ ఎజెండాగా జరిగే ఎన్నికల్లో టీడీపీ
ఓడిపోతే.. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
ప్రభుత్వం బాక్సైట్ గనుల జోలికి రాకపోవడం మంచిదని హెచ్చరించారు. ఈ పర్యటనలో
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమరనాథ్ తదితర నేతలు పాల్గొన్నారు.

Back to Top