గాంధీని చంద్రబాబు అవమానిస్తున్నాడు
కర్నూలు వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో మహాత్మా జయంతి వేడుకలు
కర్నూలు: మహాత్మాగాంధీని చంద్రబాబు అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్నారు. కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ కార్యదర్శి బీవై రామయ్య, కాటసారి రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వందల కోట్లు పెట్టి ఖర్చు చేసి తాత్కాలికం పేరుతో అసెంబ్లీ నిర్మించిన చంద్రబాబు అందులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. గాంధేయ మార్గమంటే చంద్రబాబుకు అసహ్యమని, నియంత పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. త్వరలో నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 

తాజా వీడియోలు

Back to Top