తిండిపెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకుంటుంటే కనికరం లేదా..?

అమరావతిః దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర రాక ఏ ఒక్క రైతు కూడ సంతోషంగా లేని పరిస్థితి ఉందన్నారు. గత టీడీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు, తిండిలేక అలమటించిన రోజులు మళ్లీ పునరావృత్తమవుతున్నాయన్నారు. రైతులు అష్టకష్టాలు పడి తల తాకట్టుపెట్టు అప్పు తెచ్చి పంటలు పండిస్తే...గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేస్తోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత, ఆత్మహత్యలను నివారించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

భూతల స్వర్గాలు వస్తాయి, మీరు చనిపోయాక  బ్రహ్మాండంగా ఉంటారంటూ బాబు వెరైటీ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. బాబు పాలనలో  ఏ ఒక్క పథకం ప్రజలకు ఉపయోగపడడం లేదన్నారు. రైతులంటే ఎందుకంత నిర్లక్ష్యం అని బాబును ప్రశ్నించారు. రైతుల బాధలు చూసి పక్కరాష్ట్రాలు కన్నీరుకారుస్తున్నాయి. మీకు కనబడడం లేదా బాబు..?అని నిప్పులు చెరిగారు. నేనే ఐటీ డెవలప్ చేశా, నా వల్లే అమెరికావాళ్లకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యింది, నావల్లే పలానావాళ్లకు టైటిల్ వచ్చింది అని చెప్పుకోవడం కాదు బాబు..? వాస్తవాలు చూడండి...? తిండిపెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనికరం లేదా..? రుణాలు మాఫీ చేస్తామన్నారు. కనీసం వడ్డీ కూడ మాఫీ చేయలేకపోయారు. ధరల స్థిరీకరణ నిధి అన్నారు. రూపాయి పెట్టలేదు. ఇప్పటికైనా 10 నుంచి 15వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
Back to Top