జడ్జిమెంట్‌ తరువాత విచారణ చంద్రబాబు సిద్ధాంతం


ఘటన జరిగిన గంటకే డీజీపీని తెరపైకి తెచ్చి నాటకం
ఆపరేషన్‌ గరుడపై ఎందుకు విచారణ చేపట్టలేదు బాబూ
చంద్రబాబు తెర వెనుక బాగోతం బయటపడుతుంది
వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఢిల్లీ: చంద్రబాబు వైఖరి ముందు జడ్జి మెంట్‌ తరువాత విచారణ అన్నట్లుగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. విమానాశ్రయంలో ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగిన గంటకే డీజేపీని ప్రెస్‌ ముందుకు పంపించి అభిమాని చేయించాడనే జడ్జిమెంట్‌ ఇప్పించాడని, బాధ్యత గల వ్యక్తి ఏమీ లేదని తేలిగ్గా తీసిసారేసేలా సమాధానం చెప్పడం వెనుక ఆంతర్యం కనిపించిందన్నారు. ఢిల్లీలో ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ఇరు వాదనలు విన్నాక తీర్పు వెల్లడిస్తుందని, కానీ చంద్రబాబు జడ్జిమెంట్‌ ఇచ్చేక వాదనలు, విచారణలు చేయిస్తారన్నారు. దెందులూరులో ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేస్తే చంద్రబాబు ఇరువురినీ పిలిచి వనజాక్షిది తప్పుగా తేల్చారన్నారు. దాని తరువాత ఆర్డీఓ విచారణ పేరుతో ఎంక్వైరీ అఫీసర్‌కు వనజాక్షిదే తప్పుగా తేల్చాలని క్లూ ఇచ్చాడన్నారు. ఇలా ప్రతీది నిస్పక్షపాతంగా విచారణ చేయించిన దాఖలాలు ఒక్కటీ లేవన్నారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగింది హత్యాయత్నం అని రిమాండ్‌ రిపోర్టులో క్లీయర్‌గా రాశారని ఉమ్మారెడ్డి చెప్పారు. ఆపరేషన్‌ గరుడ అని మాట్లాడుతున్న చంద్రబాబు ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం అల్లకల్లోలం కాబోతుందని చెప్పినప్పుడు తేల్చాల్సిన అవసరం ఉందని, విధ్వంసం జరిగిన తరువాత ఎవరైనా స్పందిస్తారా..? అని నిలదీశారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన తరువాత లక్షల మంది ఆదరిస్తున్నారు కాబట్టి ట్రాప్‌ వేయకపోతే కష్టం అనే నాటకం ఆడి సింపథి సంపాదించాలని చంద్రబాబు చూశాడన్నారు. చంద్రబాబు తెర వెనుక నుంచి చేయించిన బాగోతం తేలిపోయిందన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీస మానవత్వం కూడా లేకుండా అపహాస్యం చేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబుపై అలిపిరిలో బాంబు దాడి జరిగితే.. ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత మహానేత వైయస్‌ఆర్‌ తిరుపతి వెళ్లి పరామర్శించారని, అంతటితో ఆగకుండా తిరుపతి గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారని గుర్తు చేశారు. 
Back to Top