తీర ప్రాంతానికి తరలించే వరకు పోరాటం ఆగదు

పశ్చిమ గోదావరి: కాలుష్య కారకమైన తుందు్రరు ఆక్వా ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలించే వరకు పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. తుందు్రరు సమస్య జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యిందని, ప్రభుత్వం పరిష్కరించే వరకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. తుందు్రరు ఆక్వా ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు రెండు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను శనివారం వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్లనాని, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు కారుమూరి ప్రసాదరాజు, పాతపాటి స్రరాజు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రసాదరాజు దీక్షకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

Back to Top