ఐదో రోజు అదే తీరు..!

ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు అట్టుడుకాయి. ఓటుకు కోట్ల అంశం సభలో తీవ్ర దుమారం  రేపింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ మార్మోగింది. సభ ప్రారభమవ్వగానే వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ...దానిపై చర్చకు పట్టుబట్టింది. దీన్ని స్పీకర్ తోసిపుచ్చడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంవద్ద ఆందోళన చేపట్టారు. చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన పచ్చనేతలు మరోసారి నోటికి పనిచెప్పారు. 

ఓటుకు నోటుపై వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకనపడేయడంతో ...అధికారపార్టీ సభ్యులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సభను అడుగడుగునా అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతూ సభను తప్పుదోవ పట్టించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పలుమార్లు వాయిదా అనంతరం నిరసనల మధ్యే సభ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీలో ఉండి కూడా చంద్రబాబు సభకు హాజరుకాలేదు. ప్రజాసమస్యలపై చర్చించే ధైర్యం లేక అసెంబ్లీలో దాక్కోవడం సిగ్గుచేటని, ఇలాంటి అసమర్థ సీఎం మన రాష్ట్రంలో ఉండడం దౌర్భాగ్యమని ప్రజలు అనుకుంటున్నారు.. 
Back to Top