వైయస్‌ జగన్‌పై తప్పుడు కేసులను ఎత్తివేయాలి

శ్రీకాకుళం(మెరకముడిదాం): దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఎక్స్‌డెంట్‌ దుర్ఘటనలో మృతిచెందినవారిని çపరామర్శించేందుకు వెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని మెరకముడిదాం మండల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు .సి.ఎం.ఎస్‌.చైర్మెన్‌ ఎస్‌.వి.రమణరాజు, మాజీ జెడ్పీటిసి కోట్లవిశ్వేశ్వరరావు, తాడ్డెవేణుగోపాల్‌రావు, ఆపార్టీ జిల్లా కార్యదర్శులు బూర్లెనరేష్‌కుమార్, క్రరోతునాగేశ్వరరావులు, ఎంపిటిసి పప్పలకృష్ణమూర్తిలు డిమాండ్‌ చేశారు. తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిçస్తూ గురువారం మండల కేంద్రమైన మెరకముడిదాం గ్రామంలో సినిమాహాల్‌ జంక్షన్‌నుంచి తహశీల్దారు కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తప్పుడు కేసులను ఎత్తివేయాలని, అలాగే సిఎం డౌన్,డౌన్, పోలీస్‌జులుం నశించాలంటూ, అలాగే మృతులకుటుంబాలకు 20 లక్షలు ఎక్స్‌గ్రేసియాను ప్రభుత్వం వెంటనే ట్రావెల్స్‌ యాజమాన్యంతో ఇప్పించాలంటూ నినాదాలు చేసారు. అనంతరం డిసిఎంఎస్‌ చైర్మెన్‌ రమణరాజు మాట్లాడుతూ  వైయస్‌ జగన్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఒదార్చేందుకు వచ్చారని, ఇంతలో బస్సుడ్రైవర్‌ మృతదేహాన్ని పోష్టుమార్టం చేయకుండానే తరలించేందుకు వైద్యాధికారులు ప్రయత్నిస్తుండడంతో దాన్ని ప్రతిపక్ష నేత ప్రశ్నించారనే అక్కసుతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, తమ అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టిందని, అయితే ఈ విషయంలో పోలీసు అధికారులు చాలా ఓవర్‌యాక్షన్‌ చేసినట్టు కనిపిస్తుందన్నారు. ప్రమాదంలోæ 11 మంది ప్రయాణికులను పొట్టనపెట్టుకున్న దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై కేసులు పెట్టాల్సిన పోలీసు అధికారులు, ఆర్‌టిఎ అధికారులు మృతిచెందిన డ్రైవర్‌పై కేసు పెట్టి ఈ సంఘటనను నీరు గార్చేందుకు అధికారపార్టీ ఎంపికి, ఎంఎల్‌కు కొమ్ము కాసే విధంగా ప్రవర్తించడం అధికారులకు మంచి పద్దతి కాదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ సర్పంచ్‌లు బాలిబంగారునాయుడు, మండలసత్యానారాయణ, పిన్నింటిసుగణాకరరావు, సుంకరిపెదసత్యం, తలచుట్లరామ్మోహన్‌రావు, ఎంపిటిసి  సాంబారికబుచ్చయ్య, ఆపార్టీ నాయకులు సరిధిరమేష్, లెంకభాష్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top