ప‌రిటాల సునీత డైరెక్ష‌న్‌లోనే ధ‌నుంజ‌య్ హ‌త్య‌కు కుట్ర‌


అనంతపురం :  రాష్ట్ర మంత్రి ప‌రిటాల సునీత డైరెక్ష‌న్‌లోనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌నుంజ‌య్ యాద‌వ్‌ను చంద‌పేందుకు కుట్ర ప‌న్నార‌ని పార్టీ రాప్తాడు స‌మ‌న్వ‌య‌క‌ర్త తోపుదుర్తి ప్ర‌శాశ్‌రెడ్డి అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే వైయ‌స్‌ఆర్‌ సీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ధనుంజయ్‌ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నిన పదిమంది కిరాయి హంతక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక హ‌త్యా రాజ‌కీయాలు అధిక‌మ‌య్యాయ‌ని మండిప‌డ్డారు. అధికార పార్టీ నేత‌లు ప‌ట్ట‌ప‌గ‌లే అరాచ‌కాలకు పాల్ప‌డ‌టం దుర్మార్గ‌మ‌న్నారు. హ‌త్య రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాఫ్ పెట్ట‌క‌పోతే ప్ర‌జ‌లు మీకు స‌రైన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు 

  

Back to Top