వైయస్ జగన్ ను సీఎం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలి

రాజుపాలెం(వైయస్ఆర్ జిల్లా):

 స్వర్గీయ దొంతిరెడ్డి నారాయణరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు వైయస్సార్‌సీపీ నాయకులు పిలుపు నిచ్చారు. వైయస్ జగన్‌ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. వైయస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడులో దొంతిరెడ్డి నారాయణరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైయస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top