ఎస్‌.ముప్పవరం నుంచి 168వ రోజు పాదయాత్ర

నిడదవోలు (ప.గో.జిల్లా),

3 జూన్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో అనూహ్య ప్రజాదరణ నడుమ కొనసాగుతోంది. మరో ప్రజాప్రస్థానం 168వ రోజు పాదయాత్రను శ్రీమతి షర్మిల సోమవారుం ఉదయం చాగల్లు
మండలం ఎస్.ముప్పవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఉంగట్ల, చాగల్లు, మీనా నగరం, పంగిడి, కాపవరం, కొవ్వూరు మండలం దొమ్మేరు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారంనాడు శ్రీమతి షర్మిల 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ బాలరాజు తెలిపారు..

Back to Top