ఎన్నికలకు వైయస్‌ఆర్‌‌సిపి రెడీ : విజయమ్మ

పులివెందుల, 4 సెప్టెంబర్‌ 2012 : రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్‌ విజయమ్మ మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలోనే బలమైన పార్టీగా ఎదిగిందని అని ఆమె పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా ఉంటానన్న భరోసాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చారని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కుల, మతాలకు అతీతంగా ఆయన అమలు చేశారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తోందని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వైయస్ఆ‌ర్ ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయనమని ఆమె అన్నారు.

Back to Top