ఇంకెంత కాలం జగన్‌ను జైల్లో పెడతారు

పులివెందుల: ‘కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి 9, 10 నెలలుగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.. మూడు నెలలుగా జైలులో పెట్టారు.. ఈరోజు 100వ రోజు.. ఆధారాలు చూపించకుండా ఎన్నిరోజులు పెడతారు.. ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా జైలులో పెట్టారు’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని పార్టీలకంటే బలమైన పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు.  వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకే కాదు అందరికీ భరోసా ఉండేదనీ.. ప్రస్తుతం ప్రభుత్వం సమస్యల వలయంలో చిక్కి అల్లాడుతోందనీ ఆమె చెప్పారు. మహానేత వైయస్ఆర్ కుల, మతాలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించారన్నారు. త్వరలోనే యువనేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్ సువర్ణయుగం వస్తుందనీ, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయనీ విజయమ్మ తెలిపారు.

Back to Top