ఎన్నికలంటే హడలె‌త్తిపోతున్న సిఎం కిరణ్

చిత్తూరు, 25 జూలై 2013:

ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్ రెడ్డికి‌ చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల భయం పట్టుకుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారు‌లే మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దాడులను టిడిపి ఖండించకపోవడం సిగ్గుచేటు అని రోజా విమర్శించారు. రెండు పార్టీలు కలిసి సహకార ఎన్నికల తరహాలోనే పంచాయతీ ఎన్నికల్లో కూడా కుమ్మక్కయ్యాయని రోజా ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top