దున్నపోతు మీద వానపడ్డట్టే..!

చంద్రబాబు  నీవు ఓ నాయకుడివేనా..!
అభినందించాల్సిందిపోయి హీనమైన వ్యాఖ్యలా..!

గుంటూరుః వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో షర్మిల తన తల్లి, వదినలతో కలిసి  వైఎస్ జగన్ ను పరామర్శించారు . ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు.  ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్నవైఎస్ జగన్ ను అభినందించాల్సింది పోయి.. దున్నపోతు మీద వానపడ్డట్టు కనీసం చలనం లేకుండా మంత్రుల చేత హీనమైన వ్యాఖ్యలు చేయించారని ఫైరయ్యారు. 

పబ్లిక్ కంటే పబ్లిసిటీనే మక్కువ..!
చంద్రబాబుకు పబ్లిక్ కంటే పబ్లిసిటీపైనే మక్కువ అని విమర్శించారు. జగన్ దీక్ష ఉధృతమయితే పరిస్థితి ఘోరంగా ఉంటుందని వాళ్లకు తెలుసని, అందుకే డిఫెన్స్ లో పడిపోయి చంద్రబాబు  దీక్షను భగ్నం చేశారని షర్మిల అన్నారు. ప్రత్యేకహోదాను చంద్రబాబు విస్మరించినందునే ఆబాధ్యతను ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన భుజస్కందాలపై వేసుకున్నారని షర్మిల తెలిపారు. రుణమాఫీ అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. 15 ఏళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఓ నాయకుడా ..అని షర్మిల ధ్వజమెత్తారు. 

ఈపోరాటం ఇంతటితో ఆగదు..!
ఏడాదిన్నరగా వైఎస్ జగన్ తన చేతనైనంతగా హోదా కోసం ఉద్యమిస్తూనే ఉన్నారని షర్మిల చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదాపై హామీ ఇవ్వకపోతే ఈపోరాటం ఇంతటితో ఆగదని షర్మిల తేల్చిచెప్పారు. జగన్ అన్న రివరీ అవుతారు. మళ్లీ హోదాకోసం ఉద్యమిస్తారని షర్మిల స్పష్టం చేశారు. బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందని, కీటోన్ లెవల్స్ బాగా తగ్గాలని  వైద్యులు చెప్పారని షర్మిల తెలిపారు. ఈరోజంతా ఫ్లూయిడ్స్, రేపు సెమీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామన్నారని...అప్పటివరకు ఏమీ తినడానికి లేదని వైద్యులు చెప్పినట్లు షర్మిల ప్రకటించారు. 
 
Back to Top