- ప్రాజెక్టులు - నీళ్లకు మారు పేరు రాజన్న
- జరిగిన ఒప్పందాలపైనే మళ్లీ కేసీఆర్ సంతకాలు
-2019లో ప్రజలే టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతారు
-టీ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చారిత్రాత్మక ఒప్పందంగా చెప్పుకుంటున్న తెలంగాణ-మహారాష్ట్ర ఒప్పందంలో కొత్తగా ఏమీ లేవని టీ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను చూసి ఓర్వలేకనే చల్లధర్మారెడ్డి కుట్రపూరితంగా తొలగించి చెరువులో పడేశారని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పరకాలలో నీటి ఎద్దడి ఉన్న సమయంలో వైయస్ రాజశేఖరరెడ్డి రూ. 18 కోట్లు కేటాయించారని, పల్లెబాట కార్యక్రమంలో ఒక బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 6 కోట్ల నిధులు కేటాయించిన ఘనత వైయస్సార్ దేనన్నారు. అక్కడి ప్రజలెవరు వైయస్సార్ విగ్రహా తొలగింపుకు పాల్పడరని, కేవలం చల్లధర్మారెడ్డే ఈ పనికి పూనుకున్నారని అన్నారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
* డాక్టర్ మర్రిచెన్నారెడ్డి 1989లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి కాలంలో రూ. 22 వందల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చారు.
* దివిసీమ కోసం రూ. 18 వందల కోట్లు, హైదరాబాద్ జంట నగరాల అభివృద్ధి కోసం రూ. 4 కోట్లు కేటాయించారు
* ప్రస్తుత సీఎం కేసీఆర్ ఉన్నవాటిపైనే సంతకాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. రీడిజైన్ పేర కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారు.
* ప్రాణహిత, పెనుగంగల మీద ఏ ప్రాజెక్టులు ఎన్ని టీఎంసీలతో నిర్మించాలన్న విషయంపై మహానేత వైయస్ రాజన్న హాయంలోనే ఒప్పందాలు జరిగాయి
* ఇప్పుడు కొత్తగా కేసీఆర్ ఎదో సాధించినట్లు ఆ ఒప్పందాలనే చూపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు
* కేసీఆర్ చారిత్రక తప్పిదాలకు పాల్పడుతున్నారు
* వైయస్ రాజశేఖరరెడ్డి హాయంలో 33 ప్రాజెక్టులకు గానూ 6 ప్రాజెక్టులు పూర్తి చేయగా... 18 నిర్మాణంలో ఉన్నాయి... 9 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి.
* ఎల్లంపల్లె ప్రాజెక్టుకు రూ. 3200 కోట్లు వ్యయం ఉండగా... రూ. 2200కోట్లు రాజశేఖరరెడ్డి కేటాయించగా... తరువాత ప్రభుత్వాలు రూ. 800 కోట్లు కేటాయించాయి.
* మ్యానిఫెస్టోని భగవద్గీత అని చెప్పిన కేసీఆర్ ఆ మ్యానిఫెస్టోలో ఉన్న లక్ష రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదు
* రైతుల రుణమాఫీ కోసం రూ. 37500 కోట్లు కేటాయించాల్సి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది
* 30 ఏళ్ల కాలంలో ఏనాడు ఇంతమేర కరువు రాలేదు. జలవనరుల శాఖ చెప్పినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుస్తు చర్యలు చేపట్టలేదు
* తెలంగాణలో అన్నమో రామచంద్రా అన్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో సైతం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
* ఇద్దరు చంద్రుల వల్ల రెండు రాష్ట్రాల్లో కరువు తాండవం చేస్తుంది
* రాజన్న ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి. ప్రాజెక్టులు - నీరుకు మారుపేరు రాజన్న. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నేనే నీరు తెచ్చానని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదం
* కేసీఆర్ ప్రచార ఆర్భాటాలకు ప్రజలే 2019లో బుద్ధి చెబుతారు