వీరవల్లిపాలెం గ్రామంలో గడపగడపకు కార్యక్రమం

పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో బుధవారం గడప గడపకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యక్రమం జరిగింది. కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావుతో పాటు 100 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం ఎనిమిది గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 ఇళ్లకు వెళ్లి ప్రజా బ్యాలెట్లు పంచారు.

Back to Top