పాతూరు, సిరిసింపేట గ్రామాల్లో గడపగడపకు వైయస్ఆర్

ఆమదాలవలస రూరల్‌: మండలంలో గల పాతూరు, సిరిసింపేట గ్రామాల్లో బుధవారం సాయంత్రం 4 గంటల నుండి గడప గడపకూ వైయస్సార్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ హైపవర్‌కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Back to Top