అధైర్యపడొద్దు..వచ్చేది మన ప్రభుత్వం

శ్రీకాకుళంః వంశధార నిర్వాసితుల పట్ల ప్రభుత్వ మోసపూరిత వైఖరిని వైయస్ జగన్ ఎండగట్టారు. బాబుకు బుద్ధి వచ్చేలా నిర్వాసితులకు మైక్ ఇచ్చి వారి సమస్యలను వినిపించారు.  వైయస్ జగన్ తో నిర్వాసితుల ముఖాముఖి

రవి ( పాడలి)
ఎకరా భూమికి లక్ష మాత్రమే ఇచ్చారు. పోలవరం, పట్టిసీమ నిర్వాసితులకు ఎకరాకి రూ. 52 లక్షలు ఇచ్చారు. శ్రీకాకుళమని తక్కువగా ఇచ్చారు. ఇక్కడ అందరూ చిన్న సన్నకారులే. 20, 30 ఎకరాలు ఎవరికీ లేదు. అందరూ కూలీలుగా మారిపోయారు. ఇచ్చిన పరిహారం కూడ విడతలుగా ఇస్తున్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కొచ్చేసరికి...భూములకు సంబంధించి మేము ఇవ్వం. యూత్ ప్యాకేజీ అని అంటున్నారు. గ్రామసభలలో పోలీసులను తీసుకొచ్చి మేం చెప్పిన వాళ్లకే ప్యాకేజీ ఇస్తామని బెదిరిస్తున్నారు . అర్హులు మా వినతిపత్రం ఇస్తామని చెబితే పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. 2004లో వైయస్ఆర్ హయాంలో కోరుకున్న చోట ఇళ్లస్థలాలు వచ్చేవి. బాబు వచ్చాక మేం ఇచ్చిన చోటకు వెళ్లండి అంటున్నాడు. మేం ఎలా బతకాలి. ఇళ్లు పోయి, భూములు కోల్పోయి రోడ్డున పడ్డాక 4లక్షలు ఇస్తామంటే వీళ్లు ఎక్కడకు వెళ్లాలి. 12 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నాం .  మీరు నిర్వాసితులు కాబట్టి ప్రభుత్వ పనులు జరగవంటున్నారు. మౌళిక వసతులు కల్పించమని కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. 
 
శ్రీనివాసరావు(తులగాం)
2004లో వైయస్ఆర్ వచ్చాక జలయజ్ఞంలో వంశధార కట్టి జిల్లాను సస్యశ్యామలంచేయాలని నిర్వాసితులను సహకరించమన్నారు.  అప్పటి నుంచి ఎకరా లక్ష చొప్పున పరిహారం ఇచ్చారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని 2013 భూసేకరణ చట్టం చెబుతోంది. వైయస్ఆర్ హయాంలో  కొన్ని గ్రామాల్లో పునరావాసం జరిగింది. టీడీపీ వచ్చాక పునరావాసం గానీ, నిర్వాసితుల సమస్యలు గానీ పట్టడం లేదు. మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు తప్పితే నిర్వాసిత సమస్యలు పట్టించుకోవడం లేదు. వరద కాలువకు సంబంధించినరూ. 100కోట్ల పనులను 420కోట్లకు పెంచారు. అదే రైతులు, నిర్వాసితులకు ఎందుకు పెంచరు. ఆనాడు వైయస్ఆర్ ఇళ్ల నిర్మాణానికి రూ.53వేలు ఇస్తే..ఈరోజు అదే చెబుతున్నారు. ఇళ్లు ఎలా కట్టాలి..?  2013 భూసేకరణ చట్టం ప్రకారం మేం అర్హులం కాదా. పట్టిసీమ, పోలవరం , కోవాడ అన్నిటికి పరిహారం భారీగా ఇస్తున్నారు. మాకు ఎందుకు ఇవ్వరు. ఇదెక్కడి న్యాయం. ఇది పద్ధతేనా ..?ఏ గ్రామం ఖాళీ చేయలేదు. మాకు 2013 చట్టం అమలు చేసి మా బ్యాలెన్స్ లు చెల్లించి పనులు పూర్తి చేయాలే తప్ప పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారు. జిల్లా మంత్రి నీళ్లు, కరెంట్ కట్ చేయమంటున్నారు. మేం ప్రాణత్యాగానికైనా సిద్ధం. రాజీ పడేది లేదు. నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు. ఎస్పీ, డీఎస్పీలను తీసుకొచ్చి ఎవరి ప్రాణాలు తీస్తారు. 

చంద్రమ్మ
నాకు ఏమీ కనిపించదు. 2005లో ప్యాకేజీ రాస్తే ...నాకు రాయమన్నాను. నీవు తల్లిదండ్రుల దగ్గర ఉన్నావు పనికిరావన్నారు. ఇవ్వమని అన్నారు. వైయస్ఆర్ పార్టీలో మా నాన్న ఉండడంతో అంగీకరించలేదు. యూత్ ప్యాకేజీ, పీీడీఎఫ్ ప్యాకేజీలో ఇస్తామన్నారు. అదీ ఇవ్వడం లేదు. ఎకరా ఉండేది 50సెంట్లకు పడిపోయింది. ఉండడానికి ఇళ్లు లేదు. ఉంటేమీ చస్తేమీ అని బాధగా ఉంది. 

పార్వతమ్మ(హీరమండలం, గాంధీనగర్ వీధి)
మా భూమి, ఇళ్లు పోయినయి. లక్ష ఇచ్చారు. ముగ్గురం అమ్మాయిలం. చనిపోవాలనిపిస్తోంది. మాకు న్యాయం చేయండి. మా నాన్నకు అన్ని అర్హతలున్నా పెన్షన్ ఇవ్వడం లేదు.  వైయస్ఆర్ హాయంలో పెన్షన్ వచ్చేది. మహానేత పుణ్యం వల్ల మా నాన్నకు ఆపరేషన్ ఫ్రీగా జరిగింది. 

సింహాచలం(తులగాం)
ప్రభుత్వం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రజల సమస్యలు తీర్చకుండా దారుణంగా ప్రవర్తిస్తోంది. పోలీసులతో మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. 5నెలలకు పైగా టెంట్ వేశాం. ఆరోజు మీరు మ తరుపున పోరాడడానికి వచ్చారు.  మిగతా ప్రాజెక్ట్ లకు ఇచ్చిన మాదిరిగానే మాకు పరిహారం ఇవ్వాలి. నాకు 2ఎకరాలుంది. లక్ష చొప్పున ఇచ్చారు. పెళ్లిళ్లు అయిపోయినయని యూత్ ప్యాకేజీలు ఇవ్వరంట. అంటే అప్పటివరకు పెళ్లిల్లు చేసుకోవద్దా. వికలాంగులకు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. 1500 ఇస్తామని చెప్పి వేయి రూపాయలు చేస్తున్నారు. ఇది అన్యాయం, అక్రమం. వాళ్ల నాయకుల తరుపున వెళ్లినోళ్లకే చేస్తున్నారు. 

 పోలు నాయుడు(దుగ్గుపురం)
నేను 17 ఎకరాల రైతును. వంశధార ప్రాజెక్ట్ కు మేం వ్యతిరేకం కాదు.  మాకు సక్రమమైన పరష్కారమివ్వమంటే ప్రభుత్వం నిర్వాసితులు ఎలా ఇచ్చినా ఊరుకుంటారన్న ధోరణిలో ఉంది. ప్రతీ విషయంలో మాకు అన్యాయం జరిగింది. అన్నీ వలస జీవితాలు. ఈనాటికి కూడ దరఖాస్తు చేసుకుంటూ అనామకులుగా ఉన్నారు. చూస్తామంటున్నారు తప్పితే పట్టించుకోవడం లేదు. ఆనాటి యాజమానికి, వాళ్ల పిల్లలకు కూడ ఫలితాలు అందలేదు. ఇప్పటికీ పునరావాసం పూర్తి స్థాయిలో చేయలేదు. 5లక్షలు ఇస్తామని ప్రకటించారు. దాంట్లో గృహనిర్మాణమని 53వేలు మాత్రమే ఇచ్చారు. మీకు మంచి భవిష్యత్తు చూపిస్తామని చెప్పారు. అన్నీ గాలికొదిలేశారు. నిర్వాసితులను పట్టించుకోవడం లేదు. రైతు రైతుగా స్థిరపడలేదు. ఏ ఒక్క కుటుంబానికి పూర్తిగా చెల్లించామని అదికారులు వచ్చి చెప్పగలరా..? మా ఆస్తులన్నీ ఇచ్చి ఇవాల కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు సక్రమైన విలువ ఇవ్వాలి. ప్రాజెక్ట్ కు ఎవరూ వ్యతిరేకులు కాదు. మాకు ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో ఇచ్చి ఉంటే బాగుండేది. ప్రాజెక్ట్ లో అందరూ నిర్వాసితులే.  ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చాలి. 2013 చట్టాన్ని అమలు చేయాలి.

జయలక్ష్మి(పాడలి)
పొలం, ఇళ్లు కాగితాలు అన్నీ ఉన్నా ప్యాకేజీకి అర్హురాలు కావంటున్నారు. ఎకరా పొలం ముంపులో పడిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు. పైసా ఇవ్వలేదు. 

వైయస్ జగన్ మాట్లాడుతూ ఏమ్ననారంటే...
యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను దువ్వడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వలేదు.
మేమంతా భూములు కోల్పోయాం, నా పిల్లలకు వయసు తక్కువని డబ్బులు ఇవ్వకపోతే ఏ డబ్బు ఇస్తారని మహిళా రైతులు అడుగుతున్నారు
ఇదే శ్రీకాకుళం జిల్లాలో పక్కన 18 లక్షలు ఇస్తున్నారు, మాకు ఇల్లు లేదు, మన్ను లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు
చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు.. ఏడాది, ఏడాదిన్నర పోతే వచ్చేది మన పరిపాలన
అప్పుడు కచ్చితంగా 2013 భూసేకరణ చట్టం అమలుచేసి, మిగిలిన పరిహారం కూడా ఇస్తాం
ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ మేలు చేసే కార్యక్రమం చేస్తాం
సమస్య ఎక్కడ వస్తోందంటే, ప్రతి కుటుంబంలోను తక్కువ రేటు ఇచ్చి భూములు కొనుగోలు చేశారు
పక్కనే ఇదే జిల్లాలో 18 లక్షల చొప్పున అణు విద్యుత్ ప్లాంటుకు భూమి తీసుకుంటున్నారు
యూత్ ప్యాకేజి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఉంది
మొత్తం 11 వేల కుటుంబాలకు కూడా యూత్ ప్యాకేజి అమలుచేయాలి
కనీసం అప్పుడైనా కొద్దో గొప్పో న్యాయం కనిపిస్తుంది.
మీకు నచ్చినవాళ్లకు, కమీషన్లు ఇచ్చినవాళ్లకు మాత్రమే ప్యాకేజి ఇస్తున్నారు
నచ్చినవాళ్లకు మాత్రమే ఇస్తూ ప్యాకేజిని అపహాస్యం చేస్తున్నారు
ముంపు గ్రామాలకు సంబంధించి అవస్థలు పడుతున్న ప్రజల నోట్లోంచి మాటలు విన్నాం
కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా
న్యాయాన్ని పక్కనపెట్టి చేస్తున్న అన్యాయం కళ్లెదుటే కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు
చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపడదాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా అండదండలు కల్పిస్తుంది
మీరు ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి సంఘీభావం తెలిపాను, ఇప్పుడు మరోసారి వచ్చా
ఎవరూ అధైర్యపడొద్దు.. చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుంది
ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు ముందుంది
కచ్చితంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేస్తామని చెబుతున్నా
నష్టపోయినదానికి మీ అందరికీ ఆ చట్టం ప్రకారం నష్టాన్ని పూడుస్తాం
మొత్తం 11వేల కుటుంబాలకు న్యాయం జరిగేలా కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాం
ధైర్యంగా ఉండండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా మీకు తోడుగా ఉంటుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top