చంద్ర‌బాబుని అసలే న‌మ్మ‌వ‌ద్దు: ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్

పూత‌ల‌ప‌ట్టు: మోసకారి ముఖ్యమంత్రి సొంత మనుషులను సై తం నట్టేట ముంచేస్తారు’ అని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు రెండు నా ల్కల ధోరణలో వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు, అధి కారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఎన్నికల హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నా  పట్టించుకోక పోవడం దారుణమని మండి పడ్డారు. ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావంగా చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు మండల కేంద్రంలో కాపు సం ఘం మండల  నాయకులు దీక్ష చేశారు. వారికి ఎమ్మెల్యే తో పాటు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలి పారు.  గుడిపాల మండల కాపు సంఘం నాయకుడు మ దురాయల్, కాంగ్రెస్ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కి, యాదమరి ఎంపీపీ రాధమ్మ, వై ఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ధనంజయరెడ్డి, సర్పం చ్‌ల సంఘం అధ్యక్షుడు మనోహర్‌రెడ్ది,  నాయకులు మనోహర్, గోవిందనాయుడు, మా ర్కొండనాయుడు తదితరు లు  పాల్గొన్నారు.
Back to Top