మూగవేదనకు చలించిన జననేత

సైగలతో తమ కష్టాలను వివరించిన దివ్యాంగులు
ఆదుకుంటానని వైయస్‌ జగన్‌ హామీ
తూర్పుగోదావరి: మండెపులంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన దివ్యాంగులు వారి ఆవేదనను వ్యక్తం పరిచారు. వారి సమస్యలను చెప్పుకోవడానికి మాట రాకపోయినా.. సైగల ద్వారా జననేతకు అర్థమయ్యేలా వివరించారు. చంద్రబాబు చివరకు తమలాంటి వారిని కూడా చంద్రబాబు మోసం చేశారని సైగల ద్వారా ఆవేదన చెందారు. డిగ్రీలు చేసినా ఉద్యోగాలు లేవని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు మోసం చేశారన్నారు. తమకు వచ్చే పెన్షన్‌ కూడా సరిపోవడం లేదన్నారు. మూగవేదనను చలించిన వైయస్‌ జగన్‌ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 
వైయస్‌ కుటుంబానికి రుణపడి ఉంటా..
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సత్యనారాయణ అనే వ్యక్తి అన్నారు. మండెపులంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్న సత్యనారాయణ అనే వ్యక్తి వైయస్‌ఆర్‌ హయాంలో తను పొందిన లబ్ధి గురించి జననేతకు వివరించారు. ‘వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండె ఆపరేషన్‌ ఉచితంగా చేయించుకున్నా.. నా భార్య కూడా ఉచితంగా ఆపరేషన్‌ చేయించుకుంది’ అని చెప్పారు. మహానేత హయాంలో సువర్ణ యుగాన్ని చేశానన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు.. పెన్షన్‌ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top