అసెంబ్లీకి ఎడ్లబండిపై వెళ్ళిన విజయమ్మ

హైదరాబాద్‌, 17 సెప్టెంబర్‌ 2012: డీజిల్ ధర పెంపు‌,‌ వంట గ్యాస్ సిలిండర్ల పరిమితిపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వినూత్న‌ంగా నిరసన వ్యక్తం
చేసింది. సోమవారం ఉదయం నుంచి శాసనసభ సమావేశాలు
ప్రారంభం కావడానికి ముందు ప్రభుత్వ తీరును నిరసిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే
క్వార్టర్స్ నుంచి సైకి‌ల్ రిక్షాల మీద శాసనసభకు ‌వెళ్ళారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్
విజయమ్మ ఎడ్లబండిపై అసెంబ్లీకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ‌హాజరయ్యారు.

Back to Top