'దిగజారుడు రాజకీయాలు జగన్‌కు తెలియవు'

మలికిపురం:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి దిగజారుడు రాజకీయాలు తెలియవని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా పడమటిపాలెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అడబాల భాస్కరరావు, ముత్యాల బోష్, దొండపాటి అర్జున స్వామి, తాడి వెంకటేశ్వరరావుల ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ మండల శాఖ కన్వీనర్ యెనుముల నారాయణ స్వామి అధ్యక్షతన సభ ఏర్పాటైంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం సీబీఐ వల్లే మనుగడ సాగిస్తోందని నెహ్రూ అన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను ఎత్తి వేసిందన్నారు. మరో కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయ లక్ష్మి మాట్లాడుతూ రాష్ర్టంలో అన్ని వర్గాలనూ ఆదరించి, వారికోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత డాక్టర్ వైయస్ఆర్ దేనని చెప్పారు. పార్టీ క్రమ శిక్షణ సంఘం రాష్ట్ర సభ్యుడు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు మాట్లాడుతూ వైయస్ పాలన స్వర్ణయుగమన్నారు. ఆ స్వర్ణయుగాన్ని మళ్లీ చూడాలంటే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి పట్టంకట్టాలన్నారు.

Back to Top