<strong>కృష్ణా: </strong>మంత్రి దేవినేని ఉమా అసమర్ధుడని సామినేని ఉదయభాను విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, ప్రజా వ్యతిరేక పాలనతో చంద్రబాబు పాలిస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఆయన మంత్రి అయిన తరువాత నియోజకవర్గానికి ఎలాంటి మేలు చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు జి.కొండూరులో ఎన్‌టీ రామారావు ఎత్తిపోతల పథకాన్ని జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని పూర్తి చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. చెరువులను రిజర్వాయర్లుగా చేస్తామన్న ఉమా మాట తప్పారన్నారు.టమాట మార్కెట్ యార్డు నేటికి ప్రారంభం కాలేదన్నారు. మల్లెపూలకు మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. జలవనరుల శాఖలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఆయన తాబేదారులను ఏజెంట్లుగా పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.