పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్న మంత్రి దేవినేని

  • ఇంత చేతగాని దద్దమ్మకు ఇరిగేషన్‌ శాఖ ఎలా ఇచ్చారు బాబూ?
  • పోలవరానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందని ప్రశ్నిస్తే అడ్డుకున్నట్టా?
  • చూపించే ఛానళ్లు, కెమెరాలు ఉన్నాయని పిచ్చివాగుడు వాగొద్దు
  • పోలవరాన్ని డబ్బుల ప్రింటింగ్‌ మిషన్‌లా వాడుకుంటున్న టీడీపీ
  • సిమెంట్‌ షాపుల దగ్గర కూడా ముడుపులు దండుకుంటున్న దేవినేని
  • కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్ల మధ్య బ్రోకరిజం చేస్తున్న ఉమా
  • ప్రతిపక్షం ఏది మాట్లాడిన ప్రజల కోసమేనని గుర్తుంచుకోండి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి
హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఇరిగేషన్‌ శాఖామంత్రి దేవినేని ఉమా పిచ్చిపట్టిన కుక్కలా వ్యవహరిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఇంత చేతగాని దద్దమ్మకు ప్రధానమైన నీటిపారుదల శాఖామంత్రిని ఎలా అప్పగించారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్షంపై బురదజల్లడమే అధికార పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. మంత్రి దేవినేని ఉమా మాట్లాడిన తీరుపై పార్థసారథి విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చూపించే టీవీ ఛానళ్లు, కెమెరాలు ఉన్నాయని ఇరిగేషన్‌ మంత్రి ఉన్మాదిలా పిచ్చివాగుడు వాగుతున్నాడని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పోలవరం అడ్డుకుంటున్నారని బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ మాటలు చూస్తే ప్రాజెక్ట్ట్‌ పూర్తి చేయాలనే ఆలోచన ఉందా..?అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాధానం లేదన్నారు. కమీషన్లకు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రాన్ని నిధులు అడిగే దమ్ములేక ప్రతిపక్షంపై విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని అధికార టీడీపీని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసు, ఇతర లావాదేవీల్లో దొరికిపోయిన చంద్రబాబు కేంద్రం కాళ్లపై పడ్డాడని ఎద్దేవా చేశారు. 

పోలవరానికి బద్ధ వ్యతిరేకి చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు బద్ధ వ్యతిరేకి చంద్రబాబు నాయుడని పార్థసారథివిరుచుకుపడ్డారు. 2017 సంవత్సరం కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. దానిపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే డబ్బులు దండుకోవడానికి ప్రజలకు తెలియని పట్టిసీమ ప్రాజెక్టును తీసుకొచ్చి పోలవరాన్ని డిలే చేశారు..! అని టీడీపీపై మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చామని, అనంతపురం జిల్లాలో రెయిన్‌ గన్‌లతో కరువును జయించామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని ధ్వజమెత్తారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే పులివెందులలో చిని పంటలు ఎండిపోతున్నాయి.. అనంతపురం జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు. చంద్రబాబు గత తొమ్మిది ఏళ్ల పాలనలో కూడా అన్ని కరువు సంవత్సరాలేనని ఎద్దేవా చేశారు. అప్పుడు పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు అదేదో బాబు మానసపుత్రిక అయినట్లుగా చిత్రీకించుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే.. ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను రెచ్చగొట్టి ప్రాజెక్టుకు అడ్డుపడింది మీరు కాదా అని చంద్రబాబు, దేవినేని ఉమాలను నిలదీశారు. ప్రాజెక్టు కాల్వలు తవ్వుతున్న సమయంలో అడ్డుడకున్న నీచ సంస్కృతి చంద్రబాబు ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. 

కేంద్రం నుంచి పోలవరానికి ఎన్ని నిధులొచ్చాయ్‌
కృష్ణా డెల్టా కూడా క్రాఫ్‌ హాలిడే ప్రకటించే విధంగా పరిస్థితి దిగజార్చిన దేవినేని లాంటి చేతగాని దద్దమ్మ మంత్రిని ఇప్పటి వరకు చూడలేదని పార్థసారథి ఫైర్ అయ్యారు.  పోలవరం ప్రాజెక్టును ప్రజలు ఆశిస్తున్నట్లుగా లైఫ్‌లైన్‌గా కాకుండా డబ్బులు ముద్రించే మిషన్‌లా వాడుకుంటున్నారని విమర్శించారు. మంత్రుల బంధువులకు, టీడీపీ తాబేదారులకు సబ్‌ కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికి దేవినేని బ్రోకరిజం చేస్తున్నాడని చురకంటించారు. ఆఖరికి సిమెంట్‌ రేట్లు కూడా పెంచి సబ్‌ కాంట్రాక్టర్ల దగ్గర, సిమెంట్‌ షాపుల దగ్గర ముడుపులు తీసుకునే పరిస్థితికి చంద్రబాబు సర్కార్‌ దిగజారిందన్నారు. మంత్రి దేవినేనిది తనది ఒకే జిల్లా అని తాను నోరు విప్పితే ఉమా బాగోతం మొత్తం బట్టబయలవుతుందని హెచ్చరించారు. టీడీపీ దోపిడీ కోసం పెంచిన పోలవరం అంచెనా వ్యయాన్ని కేంద్రం అంగీకరించిందా అని ప్రశ్నించారు. నాబార్డుతో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ ఎంత, కేంద్రం రూ. 16 వేల కోట్లు ఇస్తుందా.. లేక మీరు పెంచిన రూ. 42 వేల కోట్లు ఇస్తుందా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సొమ్ముతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఊరుకోబోమని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించే ప్రతీ అంశం జనం కోసమేనని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 
Back to Top