దర్శిః పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దర్శి పట్టణం ఎస్సీ కాలనీలో తన సొంత నిధులు రూ. 4 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. తోలుత బొట్లపాలెం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాపిరెడ్డి పాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు, చెర్వుకొమ్ము పాలెంలో పైపులైన్ పనులను, కట్టశింగన్నపాలెంలో సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తో ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. బొట్లపాలెంలో ఎస్సీ కాలనీలో బోర్లు లేక తాగునీరు రాక అల్లాడుతున్నామని వాపోయారు. దీంతో వెంటనే తన నిధులతో రెండు బోర్లు వేయిస్తానని వైవీ వారికి భరోసానిచ్చారు. పెన్షన్లు, తాగునీటి సమస్యలపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని ఆయా గ్రామాల ప్రజలకు ఎంపీ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చీమకుర్తి మాజీ ఎంపీపీ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా యూత్ అధ్యక్షులు గంటా రామానాయుడు, మండల కన్వినర్లు వెన్నపూస వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.