రేపు ఢిల్లీకి వైయస్‌ విజయమ్మ


హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ రేపు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి  బయలు దేరుతారు.  ప్రత్యేక హోదా సాధన, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్‌లు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. వీరిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన తలనొప్పి, హైబీపీతో బాధపడుతున్న ఆయన్ను కొద్ది సేపటి క్రితమే పోలీసులు బ లవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎంపీల దీక్షకు మద్దతు తెలిపేందుకు, వారిని పరామర్శించేందుకు వైయస్‌ విజయమ్మ ఢిల్లీకి వెళ్తారు
 
Back to Top