ఫిరాయింపుదారులపై వేటు తప్పదు

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బలంగానే ఉన్నామని ఒంగోలు ఎంపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సదరు నియోజకవర్గాల్లో ప్రజల అండతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు.  ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.  పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపుదారులపై వేటు తప్పదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Back to Top