దమ్ముంటే ఉప ఎన్నికలు వెంటనే జరపాలి

 

 

కాంగ్రెస్‌ పార్టీకి దమ్మూ, ధైర్యం ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లోగా ఉప ఎన్నికలు జరిపించాలని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేని అధికార పక్షం ఎన్నికల్ని వాయిదా వేయాలని చూస్తోందని విమర్శించారు. చరిత్రలు చెప్పుకోవటం కాదని...విలువలు ముఖ్యమని అన్నారు.

 

కాంగ్రెస్‌, టిడిపి నీచ రాజకీయాలు చేస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 8 కోట్ల మంది ప్రజలు సిగ్గుపడేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 18 స్థానాలు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచు కుంటుందని శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

 

తాజా వీడియోలు

Back to Top