()కరువుతో విలవిలాడుతున్న ప్రజలు..పట్టించుకోని పాలకులు
()ఏపీలో అరాచక పాలన సాగిస్తున్న చంద్రబాబు
()దోపిడీలు, ప్రచార ఆర్భాటాలతో కాలక్షేపం
()వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్: మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరువుతో అల్లాడిపోతున్నా పట్టించుకోకుండా...హంగూ, ఆర్భాటాలతో చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. 12 రోజుల పాటు పుష్కరాల వద్ద గడిపిన చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల గురించి చర్చించే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం కేవలం ఐదు రోజులే కేటాయించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రముఖులందర్నీ పుష్కరాలకు ఆహ్వానించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు ఆహ్వానించాలని చంద్రబాబును కోరారు. శాసనసభలో చంద్రబాబు అరాచకత్వాన్ని దేశంలోని ప్రముఖందరు చూస్తారని ఎద్దేవా చేశారు.
మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
* ప్రచార ఆర్భాటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోంది
* 65శాతానికి పైగా రైతాంగం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడో సంవత్సరం కరువుతో విలవిలలాడుతుంది
* కరువు నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుంది.
* రాయలసీమలో వేరుశనగ, ఉభయ గోదావరి జిల్లాల్లో వరికి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి
* రైతులు క్రాప్ హాలీడేలను ప్రకటిస్తున్నా బాబుకు బుద్ధి రావడం లేదు
* రాష్ట్రమంతా మంచినీటి ఎద్దడి వేసవికాలంలో ఉండేదానికన్న తీవ్రంగా ఉంది
* 12 రోజుల పాటు పుష్కరాల వద్ద గడిపిన బాబు... ప్రజల గురించి చర్చించే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఐదు రోజులే కేటాయించడం దారుణం.
* దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం, మహిళల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన మంత్రులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు పేరు వచ్చింది
* అవినీతిలో కురుకుపోయి అక్రమాలు, అన్యాయాలకు నిలయంగా చంద్రబాబు రాకాసి సర్కార్ ఉంది
* మా పుష్కరాలను తిలకించండి... మా పుష్కరాల్లో మునిగి తేలండి అని దేశంలో ఉన్న ప్రముఖులందర్నీ ఆహ్వానించి సంప్రదాయంగా పండుగలను జరపడానికే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారా అన్న అనుమానం వస్తుంది.
* పుష్కరాలకు ఆహ్వానించిన పెద్దలందర్నీ శాసనసభ సమావేశాలకు సైతం ఆహ్వానించాలి. శాసనసభ వేదికగా బాబు ప్రజాగొంతులను ఏ విధంగా నొక్కేస్తారో చూడడానికి జాతీయ నాయకులను ఆహ్వానించాలి
* రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి అవసరం అన్న విషయం చంద్రబాబు మర్చిపోయాడు. ప్రపంచంలోనే అత్యంత సుందరవంతమైన రాజధానిని నిర్మిస్తానన్న చంద్రబాబు హామీ ఏమైంది.
* రాజధాని ప్రాంతంలో జరుగుతున్న దాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు అన్నా హజారేను ఆహ్వానించాలి
* మహిళ సాధికారత రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతుందో... కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లు ఏవిధంగా నడుస్తున్నాయో... వనజాక్షిలాంటి ఓ అధికారిని పట్ల శాసనసభ్యులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో.... తెలియజేయడం కోసం మహిళ కమీషన్ పెద్దలందర్నీ ఆహ్వానించాలి
* ఎస్సీ, ఎస్టీ, బీసీకి చెందిన 550 హాస్టళ్లను మూసివేసిన తీరుతెన్నులను చూడడానికి, పట్టిసీమలో నీరు పారుతుందో... అవినీతి డబ్బులు పారుతుందో చూడడానికి మేధాపట్కార్ ను ఆహ్వానించాలి
* రేపు క్రిష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టడానికి కూడా చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు
* కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంటే.. చంద్రబాబు చూస్తు ఉంటారే తప్ప కేంద్రాన్ని నిలదీయరు
* కృష్ణా - గోదావరి, నాగవలి - వంశధార, గోదావరి- పెన్నలను అనుసంధానం చేస్తానన్న మోసపూరిత మాటలతో బాబు కాలం వెల్లదీస్తున్నారు
* రాష్ట్రంలో మద్యపానాన్ని ఏరులైపారిస్తున్నారు. నదుల అనుసంధానం కాదు... ప్రజలకు మద్యంతో ఆయా నదుల నీళ్లను తాగిస్తున్నారు
* ఉత్తరాంధ్ర ప్రజలకు నాగవలి - వంశదార నీళ్లతో బ్రాండీ, విస్కీలను అనుసంధానం చేస్తున్నారు
* ఉభయగోదావరి ప్రజలకు గోదావరి నీళ్లతో మద్యాన్ని అనుసంధానం చేస్తున్నారు
* వ్యవసాయ దారుల రైతాంగం కన్నీళ్లను తుడవడానికే నేను పాదయాత్ర చేస్తున్నానని, పాదయాత్ర చేసిన ప్రతిరోజు స్వామినాథన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేస్తానన్న బాబు హామీ ఏమైంది
* ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఏన్ని కష్టాలు పడుతున్నారో ఒకసారి స్వామినాథన్ కమిటీని ఆహ్వానిస్తే తెలుస్తుంది
* శాసనసభను సంవత్సరానికి కనీసం 25 రోజులు కూడా నడిపించని చేతగానీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం
* శాసనసభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను అడ్డుకుంటున్నారు
* గోదావరి, కృష్ణా పుష్కరాలు, అమరావతి శంకుస్థాపన, సింధూ విజయవాడకు తీసుకువచ్చి చేసిన సన్మానాన్ని బాబు మార్కెటింగ్ సరుకుగా వాడుకుంటున్నారు
* మార్కెటింగ్ ప్రతిభతో కాలం వెళ్లదీయడమే తప్ప ప్రజలకు జరుగుతున్న మేలు శూన్యం
* రాయలసీమను సస్యశామలంగా మారుస్తామన్న బాబు ఇప్పుడు రాయలసీమను ఎందుకు పట్టించుకోవడం లేదు
* కరువుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు
* చంద్రబాబు ఆరాచక పాలనలో ఒక్క టీడీపీ తమ్ముళ్లకే మేలు జరుగుతుంది
* రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలం
* బాబు ఆరాచక పాలనపై వైయస్సార్‌సీపీ పెద్దఎత్తున ప్రజాపోరాటం చేస్తుందని భూమన స్పష్టం చేశారు