సీపీఎస్ రద్దు చేయాలి

హైదరాబాద్ః దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలైన సీపీఎస్ రద్దు, ఏకీకృత సర్వీస్ రూల్స్ ల అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ వైయస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జాలిరెడ్డి, ఓబులాపతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

వచ్చే నెల 16 నుంచి ప్రారంభమయ్యే  పార్లమెంట్ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలను సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు..2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ ఈవో, లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్ పోస్ట్ లను భర్తీ చేసేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
Back to Top