ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేసి.. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరుకుంది. వైయస్ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు శనివారం సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన దీక్షాస్థలికి చేరుకొని ఎంపీలతో మాట్లాడారు . రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాలను ఏచూరి అభినందించారు.