అవినీతి సర్కార్

చిత్తూరు: తెలుగుదేశం సర్కార్‌ పనులు అవినీతిమయమయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. చదరపు అడుగుకు రూ. 10 వేలు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించినా, తేలికపాటి వర్షానికి కూడా నిలబడడం లేదని విమర్శించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు సర్కార్ వృథా చేస్తుందని మండిపడ్డారు. దాదాపు రూ. 900 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ పనులే అందుకు నిదర్శనమన్నారు.

Back to Top